నాలోని భావాల లోతు వినిపించాలంటే,
తెలుగు తప్ప నాకు మరో భాష తెలియదు.
నిజంగా చెప్పాలంటే, తెలుగులోనే చెప్పాలంటే —
ఈ పదాలు, ఈ వరుసలోనే రాయాలి.
నీ కోసం శ్వాసల సముద్రం నింపుకుంటా,
కానీ నీ తలపు తీరాన్ని తాకగానే
నా ఊపిరి ఆవిరైపోతుంది —
మిగిలేది నీ జ్ఞాపకాల తడి మాత్రమే.
కోపం వస్తోంది — నా చేతుల్లో ఏమీ లేదా?
ఈ మనసు పెత్తనం ఏమిటి?
ఎలా అయిపోయావు నా ఆత్మీయుడిలా?
నా మమకారం, నా ఆకాంక్షల మధ్య…
డోపమైన్‌కి నన్ను బానిసగా మార్చేశావు.
ఎన్నో భయాల్లో ఇది ఒకటి.
నేను ఈ విరహానికి దాసోహం పడతాను కానీ,
ఒక పిచ్చి దానిలా,
ఒకే పాటని పదే పదే వినేస్తున్నాను.
నిన్నే కాదు, నన్ను కూడా
మరిచిపోతానేమోనని భయపడుతున్నా.
నువ్వు కూడా మరిచిపోతావేమో అని
నా మనసు వణుకుతోంది —
నువ్వు ఒంటరివి కాదు,
మనిద్దరం ప్రేమలో పుట్టామనే సంగతి.
మొదటిసారి మనల్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు
ఆ ఆశ్చర్యంతో నిండిన మమకారం.
ఆ హృదయాల ధ్వని నీకు గుర్తుందా?

ఎన్నో భయాల్లో, ఇది మరొకటి —
నీ మాయలో పడి,
నా బుద్ధి ఆకర్షణ వైపు తిప్పేసి,
నా తత్వమే మారిపోయి, నా దయ మిగలదేమోనని
ఆకలితో ఉన్న పిల్లలకి,
ఒంటరిగా ఉన్న ముసలి వాళ్ళకి,
పేదరికం దహనం చేసే కలలున్నవాళ్ళకి —
ఒక్క కంటి చుక్క నీళ్లు కూడా ఇవ్వలేనని.
ప్రపంచానికి నా అవసరం ఉందో లేదో కానీ,
నన్ను నేను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను.
“నిన్ను రక్షించుకోలేని ప్రేమ విలువ ఎంత?”
అని అది అడిగితే, నా దగ్గర సమాధానం లేదు.
ఈ విరహం, ఈ భయం, ఈ నిస్సహాయత —
అన్నీ తెచ్చిపెట్టుకున్నవే కదా.
అందుకే, బ్లాక్‌చేసేస్తా నిన్ను.
– 0 –
About The Article Author:
Hi, I’m Rachana. Its been my dream for years to do something to consciously create a better future where every one of us is excited about our own potential. My challenge to everyone is that they aspire for their personal best and leave a legacy of their work through their contributions to mankind.
One more thing. In December of 2044, I hope to win the Nobel.
Will you join me on this journey of growth and transformation?
Namasté.
Poetry
Human life without some form of poetry is not human life but animal existence. ~ Randall Jarrell
Life’s Precious Dream ~ A Poem On Sending Off Kids To College
- The door bell rings! Oh?! Is that you at this hour.. on this day..???I better get it.. It may be your first visit after you left home to realize your dream.. Who is going to win all those shouting matches played out in this very living room?The house is now...
Daddy and Me..
- All this week I have been thinking of my father, because it was his birthday yesterday.. I feel terribly home sick and awfully miss daddy when his birthday is approaching, the day it is his birthday and a few days after the fact.. :) It has been an exciting...
A Mother’s Night Out
- Dreams of laughter and gossip in the days before..One less shift of diaper duty on this day..Promises to yourself that you are not selfish..Rolling down the window to feel the freedom in the 'h'air ..A nervous text to check on their welfare..Celebrate woman,...
A Tribute to My Aunt: The Woman Who Taught Me How to Love, Live, and Let Go
- Today, I thought I will stop.. Take a break and really pen down how I feel.. Take a break from everything, sleeping, eating, cooking, feeding, cleaning .. everything..Because I know the value of taking a break and just for a second, stopping to catch a...
The Inception of Future STRONG: Brothers In Love And A Connection To The Heart
Want To Listen To The Article Instead? Brothers In Love. A Connection To The Heart. It was love at first sight in the hospital. His little brother was in my arms waiting for his first reaction.It was plain and clear, that of love. And now at home, He hovers...





It might be the first ever telugu poem by the writer. Congratulations.
Read more and more in telugu as well.
Thanks so much amma, will do ❤️